Published on May 30, 2025
Current Affairs
కాశిమేడు తీరంలో అరుదైన సూక్ష్మజీవులు
కాశిమేడు తీరంలో అరుదైన సూక్ష్మజీవులు

చెన్నై సమీపంలోని కాశిమేడు తీరంలో పెరోనస్‌ జాతికి చెందిన అరుదైన సూక్ష్మజీవుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ జీవులు ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు, మూడుచోట్ల మాత్రమే కనిపించగా ఆ తర్వాత వాటి ఉనికి ఇక్కడే బయటపడటం విశేషం.

జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్‌ అంజుమ్‌ రిజ్వీ, రితికా దత్తా ఈ పరిశోధనలు చేశారు.

వీటిల్లో ఒకరకం 1966లో దక్షిణాఫ్రికా తీరంలో కనిపించగా, మరోరకం 2015లో చైనా తీరంలో చూసినట్లుగా వారు వివరించారు.

మూడో రకం సూక్ష్మజీవులను ఇప్పుడు తమిళనాడు తీరంలో గుర్తించామని తెలిపారు. 

ఈ జీవులకు పరిశోధకులు ‘పెరోనస్‌ జైరాజ్‌పురి’ అని పేరుపెట్టారు.

దేశంలో ప్రముఖ నెమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎంఎస్‌ జైరాజ్‌పురి గౌరవార్థంగా ఈ పేరు ఖరారు చేసినట్లు జెడ్‌ఎస్‌ఐ ప్రకటించింది.