ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా బి.సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. 2025 అక్టోబరు 31న పీఎం ప్రసాద్ పదవీ విరమణ చేసిన తర్వాత తాత్కాలిక ఛైర్మన్‌గా బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా కొనసాగారు. ఇప్పుడు పూర్తిస్థాయి నియామకంలో భాగంగా సాయిరాం బాధ్యతలు తీసుకున్నారు.
ఈ నియామకానికి ముందు సాయిరాం కోల్ ఇండియా అనుబంధ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎన్‌సీఎల్)కు సీఎండీగా పనిచేశారు.