ప్రభుత్వ రంగ కోల్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్ ఇండియాకు 80% వాటా ఉంది.