Published on Dec 19, 2025
Government Jobs
కోల్ ఇండియాలో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు
కోల్ ఇండియాలో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎల్‌ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో వివిధ విభాగాల్లో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఇంటస్ట్రియల్‌ ట్రైనీ (సీఏ/సీఎంఏ): మొత్తం 125 పోస్టులు

(యూజీ- 51; ఓబీసీ- 34; ఎస్సీ- 19; ఎస్టీ- 09; ఈడబ్ల్యూఎస్‌-12)

కంపెనీల వారీగా పోస్టులు:

1. కోల్ ఇండియా లిమిటెడ్ (కోల్‌కతా): 7

2. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (ధన్‌బాద్): 12

3. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (రాంచీ): 15

4. సీఎంపీడీఐఎల్‌ (రాంచీ): 7

5. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 12

6. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20

7. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20

8. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20

9. వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 12

అర్హత: అభ్యర్థులు ఐసీఏఐ నిర్వహించే సీఏ ఇంటర్మీడియట్ లేదా ఐసీఎంఏఐ నిర్వహించే సీఎంఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇది వరకే ఏడాది లేదా అంతకు మించి ట్రైనింగ్‌ను పొందినవారు అర్హులు కారు.

వయో పరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌కు 28 సంవత్సరాలు; ఓబీసీలకు 31 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు. 

స్టైపెండ్‌: నెలకు 22,000.

ట్రైనింగ్‌ కాలం: 15 నెలలు.

ఎంపిక ప్రక్రియ: సీఏ/సీఎంఏ మార్కుల మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 26-12-2025.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15-01-2026.

Website:https://www.coalindia.in/