ప్రభుత్వరంగ గనుల సంస్థ ఎన్‌ఎండీసీ అమెరికాలోని కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్‌తో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రధానంగా మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్, మెటలర్జీ, గనుల విభాగంలో ఏఐ/ఎంఎల్ (కృత్రిమమేధ/యాంత్రీకరణ)పై పరిశోధనలు నిర్వహించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది.