Published on Sep 20, 2024
Current Affairs
కొలియర్స్‌ నివేదిక
కొలియర్స్‌ నివేదిక

భూములు, నిర్మాణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ పెట్టుబడిదార్లకు అనుకూల దేశంగా భారత్‌ మారుతోంది. 2024లో అంతర్జాతీయంగా ఇటువంటి పెట్టుబడుల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచిందని క్యాపిటల్‌ మార్కెట్లు, పెట్టుబడుల సేవలు అందించే కొలియర్స్‌ తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచంలో స్థిరాస్తి పెట్టుబడులు ఎక్కువగా ఉన్న దేశాలు (డాలర్లలో)

1. చైనా: 36.48 బిలియన్‌ డాలర్లు  2. సింగపూర్‌:  1.93 బిలియన్‌ డాలర్లు

3. భారత్‌:  1.49 బిలియన్‌ డాలర్లు  4. బ్రిటన్‌: 1.32 బిలియన్‌ డాలర్లు

5. జర్మనీ: 1.23 బిలియన్‌ డాలర్లు  6. ఆస్ట్రేలియా: 928 మిలియన్‌ డాలర్లు

7. వియత్నాం: 912 మిలియన్‌ డాలర్లు  8. అమెరికా: 638 మిలియన్‌ డాలర్లు

9. మలేసియా: 327 మిలియన్‌ డాలర్లు  10. జపాన్‌: 273 మిలియన్‌ డాలర్లు