భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పి.ఎఫ్.బి.ఆర్) తమిళనాడులోని కల్పకం అణు కేంద్రంలో 2026, సెప్టెంబరు నుంచి పని ప్రారంభించనుంది. భారత్ చేపట్టిన మూడంచెల అణు విద్యుదుత్పాదన కార్యక్రమంలో పి.ఎఫ్.బి.ఆర్ రెండో అంచె కిందకు వస్తుంది. దీనిలో వాడిన అణు ఇంధనం మూడో అంచెలో థోరియం అధారిత అణు కేంద్రాలకు చోదక శక్తిగా పని చేస్తుంది.
* మొదటి అంచెలోని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు సహజ యురేనియంను ఇంధనంగా వాడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ప్లుటోనియం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు (ఎఫ్.బి.ఆర్) ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఆ ఇంధనం నుంచి మళ్లీ యురేనియం, థోరియం ఉత్పన్నమవుతాయి. చివరకు థోరియం ఆధారిత అధునాతన అణు రియాక్టర్లు విద్యుదుత్పాదన సాగిస్తాయి.