మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, అయిదేళ్లలోనే తొలిసారిగా కీలక రేట్లను తగ్గిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది.
కీలక రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతం చేసింది.
2020 మే తర్వాత మొదటిసారిగా రేట్ల కోత విధించారు.
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత రెపో రేటులో సవరణ చేశారు.
ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 5 నుంచి నిర్వహించిన పరపతి విధాన సమావేశం (ఎంపీసీ)లో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2025, ఫిబ్రవరి 7న వెల్లడించారు.
పరపతి విధానంలో ‘తటస్థ’ వైఖరిని ఆర్‌బీఐ కొనసాగించింది.