పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాలుగు భిన్నమైన క్లబ్‌ల తరఫున వందేసి గోల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు.
2025, ఆగస్టు 23న సౌదీ సూపర్ కప్ ఫైనల్లో అల్ అహిల్‌పై పెనాల్టీని గోల్‌గా మలిచిన రొనాల్డో అల్ నాసర్ క్లబ్ తరుఫున వందో గోల్ నమోదు చేశాడు.
రియల్ మాడ్రిడ్ తరఫున 450 గోల్స్ సాధించిన రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్‌కు 145.. జువెంటస్‌కు 101 గోల్స్ కొట్టాడు.