Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 31, 2026
Current Affairs
క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక
క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక
  • 2025లో వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, కరవు, తుపానులు మొదలైన వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రష్యాకు చెందిన క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక వెల్లడించింది. ఈ విపత్తులు సహజమైనవి కావని, శిలాజ ఇంధనాల వినియోగం, రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది. 
  • అమెరికాలో కాలిఫోర్నియా కార్చిచ్చులు అత్యధికంగా రూ.5 లక్షల కోట్ల (సుమారుగా) నష్టం కలిగించాయని వెల్లడించింది. ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, ఇండోనేసియా, శ్రీలంక, వియత్నాం, మలేసియాల్లో సంభవించిన తుపానుల కారణంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది.