భారత సంతతికి చెందిన బ్రిటిష్ కవలలు ప్రసిద్ధ మెన్సా సంస్థ నిర్వహించిన అత్యున్నత స్థాయి ఐక్యూ (తెలివితేటల సూచిక) పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు.
మెన్సా ఛాలెంజ్ పరీక్షలో 11 సంవత్సరాల క్రిష్ 162 పాయింట్లు పొంది అత్యధిక ఐక్యూ కలిగిన 0.26 శాతం మంది పిల్లల కోవలో స్థానం పొందాడు.
ఆ బాలుడి సోదరి కైరా 152 పాయింట్లు సాధించి అత్యున్నత ఐక్యూ కలిగిన 2 శాతం చిన్నారుల కోవలోకి చేరారు.
ఐక్యూ పరీక్షలో 140 పాయింట్లు సాధించిన పిల్లలు అసాధారణ ప్రతిభా పాటవాలు ఉన్నట్లు లెక్క.