దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2025, ఆగస్టు 21న ప్రకటించారు. దేశంలో 38శాతం కుటుంబాలే డిజిటల్ అక్షరాస్యత సాధించాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను పొందిన రాష్ట్రంగా కేరళ ప్రత్యేకత చాటుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.