Published on Dec 6, 2025
Current Affairs
కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క
కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క
  • అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్కను 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్లీ కనుక్కున్నారు. ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’గా ఈ మొక్కను గుర్తించారు. వయనాడ్‌ జిల్లాలోని థొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది. ఈ జాతి మొక్కను మొదట 1849కి ముందు తమిళనాడులోని నడువట్టం వద్ద స్కాటిష్‌ వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్‌ విట్‌ చూశారు. అయితే, దీనికి సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులేవీ లేవు. 
  • కేరళలోని కాల్‌పెట్టకు చెందిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు సలీం పిచాన్‌తోపాటు అలప్పుజలోని సనాతన ధర్మ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్‌ జోస్‌ మాథ్యూ, అరుణ్‌రాజ్, డాక్టర్‌ వి.ఎన్‌.సంజయ్, శ్రీలంక యూనివర్సిటీకి చెందిన బి.గోపల్లవ బృందం ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’ను కనుగొంది.