కేరళలోని కన్నూర్ జిల్లా ఆరళంలో ఉన్న దేశంలోనే తొలి సీతాకోకచిలుకల అభయారణ్యం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆరళం అభయారణ్యాన్ని సీతాకోకచిలుకల పెంపకం, వలసలకు ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించాలని ప్రకటించింది. వలస జీవులైన ఆల్బాట్రాస్ సీతాకోకచిలుకలు పశ్చిమ కనుమల నుంచి ఆరళం ప్రాంతానికి వేలల్లో తరలివస్తాయి.
తేమతో కూడిన నేల లేదా నది ఒడ్డున ఉన్న బురద నుంచి ఖనిజాలు, లవణాలను గ్రహించడానికి వేలల్లో సీతాకోకచిలుకలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీన్నే ‘సాయిల్ పడలింగ్’ అంటారు.