దేశంలో కార్యాలయ స్థలాల అద్దె విషయంలో దిల్లీ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఇక్కడ చదరపు అడుగుకు అద్దె రూ.340 ఉంది. ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో ఇది ఆరో ఖరీదైన మార్కెట్ అని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ ఆసియా పసిఫిక్ ప్రైమ్ ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ జులై-సెప్టెంబరు 2024 నివేదికలో వెల్లడించింది.
హాంకాంగ్ అత్యంత ఖరీదైన మార్కెట్‌గా నిలిచిందని తెలిపింది.
ముంబయిలో 5 శాతం, బెంగళూరులో 3 శాతం చొప్పున అద్దెలు పెరిగాయని పేర్కొంది. ముంబయిలో చ.అడుగు ధర రూ.317 (8వ స్థానం)గా ఉంది. బెంగళూరులో చ.అడుగు ధర రూ.138 (18వ స్థానం)గా ఉంది.