Published on Jan 6, 2026
Current Affairs
కార్బన్‌ డైఆక్సైడ్‌తో మిథనాల్‌ ఇంధనం ఉత్పత్తి
కార్బన్‌ డైఆక్సైడ్‌తో మిథనాల్‌ ఇంధనం ఉత్పత్తి
  • కార్బన్‌ డైఆక్సైడ్‌ను మిథనాల్‌ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫొటోకెటలిటిక్‌ పదార్థాన్ని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సూర్యకాంతి సాయంతో ఈ చర్య జరుపుతుంది. పర్యావరణానికి మరింత హాని జరగకుండా.. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇది మెరుగైన ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై ఆధారపడటం వల్ల కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలు పెరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణంపై ఒత్తిడి పడటంతోపాటు భూతాపం పెరుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు ఫొటోకెటలిటిక్‌ విధానాల రూపకల్పనపై పనిచేస్తున్నారు.
  • అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది వేగంగా శక్తిని కోల్పోతుంది. ఇంధన ఉత్పత్తి కూడా తక్కువే. ఈ సమస్యలకు గట్టి విరుగుడు ఇప్పటివరకూ కనుగొనలేదు. ఈ నేపథ్యంలో గువాహటిలోని ఐఐటీ గ్రాఫైటిక్‌ కార్బన్‌ నైట్రైడ్‌ను ఫ్యూ లేయర్‌ గ్రాఫీన్‌తో కలిపారు. అత్యంత పలుచగా ఉండే ఈ గ్రాఫీన్‌ పదార్థం.. శక్తి నష్టాన్ని తగ్గించింది. సూర్యకాంతి సమక్షంలో ఇది సాధ్యమైంది. ఇది ఉత్ప్రేరకాన్ని దీర్ఘకాలం క్రియాశీలంగా ఉండేలా చేసింది.