విజయ్‌హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక విజేతగా నిలిచింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని జట్ట్టు 2025, జనవరి 18న జరిగిన ఫైనల్లో 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది.
మొదట కర్ణాటక 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఛేదనలో విదర్భ పోరాడినా.. 48.2 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది.
విజయ్‌హజారే ట్రోఫీ గెలవడం కర్ణాటకకు ఇది అయిదోసారి. ఆ జట్టు చివరగా 2019-20 సీజన్లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.