2023-24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు జీడీపీలో 18.1 శాతానికి పరిమితమైందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. స్థూల దేశీయ పొదుపు 2014-15లో జీడీపీలో 32.2 శాతంగా ఉండగా, 2023-24 నాటికి జీడీపీలో 30.7 శాతానికి పరిమితమైంది. మరోవైపు కుటుంబాల రుణాలు జీడీపీలో 6.2 శాతానికి పెరిగాయి.
మరిన్ని అంశాలు..
పొదుపు ధోరణులను గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి.
2024తో పోలిస్తే 2025, ఫిబ్రవరిలో గ్రామీణ పురుష కార్మికుల వేతనాలు 6.1% వృద్ధి చెందాయి.
వరుసగా నాలుగో నెలా గ్రామీణ ద్రవ్యోల్బణం కంటే ఇది అధికం.
2025 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి తగ్గింది.
2019 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పం.
వంట నూనెలు (17.4%), పండ్లు (13.8%) ధరలు మాత్రమే అధికంగా కొనసాగాయి.
రిజర్వాయర్‌ల్లో మంచి నీటి నిల్వలు, ఈ ఏడాది సగటు కంటే అధిక వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలతో ఆహార ధరల స్థిరత్వం కొనసాగొచ్చని నివేదిక అంచనా వేసింది.