Published on Oct 28, 2024
Current Affairs
కాయిన్‌ వెండింగ్‌ మెషీన్‌
కాయిన్‌ వెండింగ్‌ మెషీన్‌

దేశంలోనే మొదటి క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత కాయిన్‌ వెండింగ్‌ మెషీన్‌ను కేరళలో ప్రారంభించారు. కోజీకోడ్‌లోని పుతియారాలో ఉన్న ఫెడరల్‌ బ్యాంకులో ఈ మెషీన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఇందులో తెరపై కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ ద్వారా వినియోగదారు ఖాతా నుంచి డబ్బు చెల్లించి కావాల్సిన చిల్లర నాణేలను తీసుకోవచ్చు.

ఈ మెషిన్‌లో 1, 2, 5, 10 రూపాయల నాణేలు అందుబాటులో ఉంటాయి. అవసరమైన చిల్లర నాణేలపై క్లిక్‌ చేయాలి. లావాదేవీ పూర్తయిన తర్వాత మెషిన్‌ నుంచి నాణేలు బయటకు వస్తాయి.