- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్‌ను రూపొందించింది. క్యాన్సర్‌ను నోటిఫై వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రూపొందించిన అట్లాస్ ద్వారా ఎక్కడికక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకుంది.
- క్యాన్సర్ అట్లాస్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యాధి పీడితులు ఉన్నారు. అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో (8,101) ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (1,495) ఉన్నాయి. పీడితుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. 50-59 ఏళ్ల వయసు వారు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.