తెలంగాణలోని బీబీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ సహా దేశంలోని 16 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ 2026, జనవరి 14న నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాట్ అనేది క్వాసీ జ్యుడిషియల్ వ్యవస్థ. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన విధినిర్వహణ సమస్యల వివాదాలను సీఏటీ విచారించి పరిష్కరిస్తుంది.
ఇప్పుడు 16 ఎయిమ్స్‌లను దీని పరిధిలోకి చేర్చినందున ఈ సంస్థల్లోని నియామకాలు, వ్యవహారాలు, సర్వీసులు, పోస్టుల విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు ప్రాథమికంగా సీఏటీను ఆశ్రయించాల్సి ఉంటుంది.