Published on Nov 19, 2025
Current Affairs
క్యూఎస్‌ సుస్థిర విద్యాసంస్థలు
క్యూఎస్‌ సుస్థిర విద్యాసంస్థలు
  • క్యూఎస్‌ సుస్థిర విద్యా సంస్థల్లో దిల్లీ, బొంబాయి, ఖరగ్‌పుర్‌ ఐఐటీలకు చోటు దక్కింది. 2023లో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో 2026 ఏడాదికిగానూ స్వీడన్‌లోని లండ్‌ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన టొరంటో యూనివర్సిటీ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. బ్రిటన్‌లోని యూసీఎల్‌ వర్సిటీ మూడో స్థానంలో నిలిచింది.
  • మొత్తం 700 వర్సిటీలకు లండన్‌ కేంద్రంగా పని చేసే క్యూఎస్‌ సంస్థ ర్యాంకులను ఇచ్చింది.  భారత విద్యా సంస్థల్లో దిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.