Published on Mar 13, 2025
Current Affairs
క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌
క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌

లండన్‌కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ 2025, మార్చి 12న 15వ సబ్జెక్టు వారీ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది.

వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలో అత్యుత్తమమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో తొమ్మిది భారతీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానం దక్కింది.

మినరల్, మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ధన్‌బాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ (ఐఎస్‌ఎం) ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. మన దేశ విద్యా సంస్థల్లో అగ్రస్థానం పొందింది. 

ఇదే విభాగంలో ఐఐటీ బాంబే 28వ, ఐఐటీ ఖరగ్‌పూర్‌ 45వ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ రెండు విద్యా సంస్థలు ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లోనూ తొలి 50 అగ్రశ్రేణి సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి.