క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024, డిసెంబరు 10న విడుదలయ్యాయి. అందులో భారత్‌కు చెందిన ఐఐటీ దిల్లీ 255 స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచవ్యాప్తంగా 171వ స్థానానికి చేరింది.
‘సస్టేనబిలిటీ’లో ఐఐటీ దిల్లీ ఈ ర్యాంక్ సాధించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పర్యావరణ విద్యలో ప్రపంచంలోని టాప్ 50 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
మొత్తంగా భారత్ నుంచి 78 విశ్వవిద్యాలయాలు 2025 క్యూఎస్ సస్టేనబిలిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. దేశంలోని టాప్ 10 విద్యాసంస్థల్లో 9 సంస్థలు తమ స్థానాల్ని మెరుగుపరుచుకున్నాయి.
ఈ జాబితాలో కెనడాలోని టొరొంటో వర్సిటీ టాప్ ర్యాంక్ సాధించింది. ఈటీహెచ్ జూరిక్ (స్విట్జర్లాండ్) రెండో స్థానంతో నిలిచింది.