విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక క్వాకరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ - 2026’ పేరిట ర్యాంకులను 2026, మార్చి 25న విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని టాప్- 50 వర్సిటీల జాబితాలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి భారత్ నుంచి దిల్లీ, బాంబే, ఖరగ్‌పూర్, మద్రాస్ ఐఐటీలతోపాటు జేఎన్‌యూ, బిట్స్-పిలానీలు చేరాయి. మొత్తం 99 విద్యా సంస్థలు వివిధ ర్యాంకులు సాధించాయి. కెమికల్, మెకానికల్, ఎలక్టిక్రల్, మైనింగ్ వంటి విభాగాల్లో భారతీయ సంస్థలు టాప్ 100, టాప్ 50 ర్యాంకుల్లో భారత సంస్థలు చోటు సంపాదించాయి.
ఈ ఏడాది 6 భారతీయ సంస్థలు టాప్ 100లో నిలవగా, గత ఏడాది ఈ సంఖ్య 2 మాత్రమే.
ఐఐటీ దిల్లీ తొలిసారిగా ఆరు ప్రధాన ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో టాప్ 50లో నిలిచింది.