కేంద్ర సమాచార కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఇండియన్ లీగల్ సర్వీస్ అధికారి అయిన ఈమెకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్, లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగంలో 35 ఏళ్ల అనుభవం ఉంది.
తెలుగువారైన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ 2013 నవంబరు నుంచి 2018 నవంబరు వరకు కేంద్ర సమాచార కమిషనర్‌గా సేవలందించారు.