భారత ప్రధాని నరేంద్రమోదీ 2025, ఏప్రిల్ 5న శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసనాయకేతో కొలంబోలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి తొలిసారిగా భారత్-శ్రీలంక ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటివి దీనిలో ఉన్నాయి.
రుణాల పునర్వ్యవస్థీకరణకూ భారత్ ఆమోదం తెలిపింది.
బ్యాంకాక్‌లో బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొన్న మోదీ నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు.
కొలంబోలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద కుమార దిసనాయకే ఆయనకు స్వాగతం పలికారు.
ఇక్కడ ఓ విదేశీ ప్రభుత్వాధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమం.