మధ్యాఫ్రికాలోని కామెరూన్‌లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పాల్ బియా (92) తిరిగి విజయం సాధించారని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 2025, అక్టోబరు 27న ప్రకటించింది. పాల్ బియా 1982 నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయ పరంపర సాగిస్తున్నారు.