స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్ (18 ఏళ్లు) ఘనత సాధించారు. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసింది. ప్రపంచంలో స్కీయింగ్ ద్వారా అక్కడికి చేరుకున్న రెండో అతిపిన్న వయసు మహిళ ఆమే.