దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఐదు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 306 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు:
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ)-2026
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్- మూడు సబ్జెక్టుల వరకు రూ.1000; అడిషనల్ సబ్జెక్టుకు రూ.400. ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్ సబ్జెక్టుకు రూ.375.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్ సబ్జెక్టుకు రూ.350.
తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, పెద్దపల్లి.
ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అదోని, అమలాపురం, అనంతపురం, బీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమహేంద్రవరం, రాయచోటీ, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ తేదీలు: 03-01-2026 నుంచి 30.01.2026.
రుసుము చెల్లింపు చివరి తేదీ: 31-01-202.
దరఖాస్తు సవరణ తేదీలు: 02 నుంచి 04-02-2026 వరకు.
పరీక్ష తేదీలు: 11- 31-05-2026 వరకు.
Website:https://cuet.nta.nic.in/