కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షుల 28వ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 15న పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రారంభించారు. 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు/ సభాధ్యక్షులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు.
పార్లమెంట్ నిర్వహణలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంటు సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంట్ కార్యకలాపాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సదస్సులో చర్చించారు.