Published on Sep 9, 2025
Current Affairs
కామన్‌వెల్త్‌ స్టార్టప్‌ ఫెలోషిప్‌
కామన్‌వెల్త్‌ స్టార్టప్‌ ఫెలోషిప్‌

వ్యవసాయం, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పని చేస్తున్న 3 భారతీయ కంపెనీలు కామన్‌వెల్త్‌ స్టార్టప్‌ ఫెలోషిప్‌ (సీఎస్‌సీ)నకు ఎంపికయ్యాయి.

వీటిలో అక్షయ్‌ కవాలే స్థాపించిన అగ్రోస్యూర్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ ఇన్నోవేషన్స్, అభిమన్యు సింగ్, శిల్పి దువా సహ వ్యవస్థాపకులుగా ప్రారంభించిన హెక్స్‌ప్రెషన్స్, నిశాంత్‌ అగర్వాల్‌ స్థాపించిన లైఫ్‌ అండ్‌ లింబ్‌ అంకురాలు ఉన్నాయి. 

అర్హత కలిగిన 44 దేశాల నుంచి కామన్‌వెల్త్‌ స్టార్టప్‌ ఫెలోషిప్‌నకు పోటీ పడిన 1,400 కంపెనీల్లో ఎంపికైన 19 అంకురాల్లో మన దేశం నుంచి 3 స్టార్టప్‌లు ఉన్నాయి.