కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ కోయెల్ బార్ యూత్ విభాగంలో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పుతూ ఛాంపియన్‌గా నిలిచింది.
2025 ఆగస్టు 26న అహ్మదాబాద్‌లో జరిగిన 53 కేజీల విభాగంలో కోయెల్ స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 107 కేజీలు.. మొత్తంగా 192 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో యూత్ విభాగంలో స్నాచ్, ఓవరాల్ బరువుల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది.
జూనియర్, యూత్ విభాగాలు రెంటికీ ఈ ప్రదర్శనను పరిగణించడంతో ఆమెకు రెండు పసిడి పతకాలు దక్కాయి.