గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల కోసం ప్రత్యేక హిందీ గీతం కేరళలో రూపొందింది. 2030లో జరిగే ఈ క్రీడల్లో ఈ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కోజికోడ్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ వశిష్ఠ్ దీనికి రూపకల్పన చేశారు. ఆయన మాజీ విద్యార్థి సాయి గిరిధర్ ఆలపించారు. కామన్‌వెల్త్ క్రీడలు ప్రపంచానికి భారత్ అందించే బహుమతి అంటూ గీతం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల యువత భాగస్వామ్యాన్ని వర్ణిస్తుంది.