కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతుధరను పెంచింది. మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా రూ.11,582గా, బంతి కొబ్బరి ధరను రూ.12,100గా నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024, డిసెంబరు 20న జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది.
2024తో పోలిస్తే మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటాకు రూ.422, బంతి కొబ్బరి ధర రూ.100 మేర పెంచారు.