Published on Nov 17, 2025
Government Jobs
కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు
కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్‌ సెక్రటేరియట్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌-బి (నాన్‌ గేజిటెడ్‌) డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (టెక్నికల్‌) పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ ప్రకారం పోస్టు వివరాలు: 

డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (టెక్నికల్‌)- 250 పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 124

డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌: 10

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అండ్‌/ లేదా కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌: 95

సివిల్‌ ఇంజినీరింగ్‌: 02

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 02

ఫిజిక్స్‌: 06

కెమిస్ట్రీ: 04

మ్యాథమెటిక్స్‌: 02

స్టాటిస్టిక్స్‌: 02

జియోలజీ: 03

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పైన పేర్కొన్న ఏదైన ఒక సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ కలిగి ఉండాలి. గేట్‌ 2023, 2024 లేదా 2025 వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ తప్పనిసరి.

జీతం: నెలకు రూ.99,000.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ, ద్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్టు ద్వారా లోధీ రోడ్‌, హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, న్యూదిల్లీ చిరునామాకు పంపించాలి.

చివరి తేదీ: 14.12.2025

Website:https://cabsec.gov.in/index.php