పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)’ 29వ సదస్సు అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా 2024, నవంబరు 11న ప్రారంభమైంది.
వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చిస్తారు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.
మన దేశం తరఫున 19 మంది సభ్యుల బృందం పాల్గొంటుంది. సదస్సులో భారత్ నవంబరు 18-19 తేదీల్లో తన అధికారిక ప్రకటన చేస్తుంది.
కాప్-29 సదస్సు నవంబరు 22 వరకు కొనసాగుతుంది.