దిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 53
వివరాలు:
1. జాయింట్ డైరెక్టర్: 02
2. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 02
3. డిప్యూటీ డైరెక్టర్(అకడమిక్స్): 02
4. డిప్యూటీ డైరెక్టర్(కార్పొరేట్ కమ్యూనికేషన్): 01
5. ఐటీ సెక్యూరిటీ మేనేజర్: 01
6. ఎగ్జిక్యూటివ్: 03
7. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
8. డీన్: 04
9. రీసెర్చ్ అసోసియేట్: 20
10. ఎగ్జిక్యూటివ్(కెరియర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్): 04
11. అకౌంటెంట్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐసీఎస్‌ఐ/ఐసీఏఐ/ఐసీఏఐ, ఎంసీఏ లేదా బీటెక్(ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్‌సైన్స్), డిగ్రీ(కామర్స్), ఏసీఎస్/ఏసీఏ/ఏసీఎంఏ లేదా 50 శాతం మార్కులతో పీజీ(ఎకనామిక్స్/కామర్స్/ మేనేజ్‌మెంట్/లా) లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి జాయింట్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్, రీసెర్చ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్(కెరియర్ అవేర్‌నెస్), అకౌంటెంట్‌కు 40 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, డీన్‌కు 62 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రీసెర్చ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్‌కు రూ.50,000, డీన్‌కు రూ.2,50,000, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100, ఎగ్జిక్యూటివ్(లా/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/హెచ్‌ఆర్)కు రూ.47,600 - రూ.1,51,100, ఐటీ సెక్యూరిటీ మేనేజర్‌కు రూ.56,100 - రూ.1,77,500, డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.67,700 - రూ.2,08,700, జాయింట్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.78,800 - రూ.2,09,200.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 2
Website: https://www.icsi.edu/careers/