దిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ అర్కిటెక్చర్ 2025 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ (పీజీఈటీఏ 2025)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఫుల్ టైం డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ అర్కిటెక్చర్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా అర్కిటెక్చర్ విభాగంలో పీజీ ప్రవేశాలకు పొందవచ్చు.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ అర్కిటెక్చర్ (PGETA 2025)
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హతలు: అర్కిటెక్చర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష సెంటర్లు: దేశవ్యాప్తంగా గల అన్ని ప్రముఖ నగరాల్లో.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీకు రూ.1750; ఈడబ్ల్యూఎస్‌కు ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1250, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.04.2025.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: 01.05.2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 04.05.2025.
ఫలితాలు: 06.05.2025.
Website:https://www.coa.gov.in/