కోనేరు హంపి (37 ఏళ్లు) రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్‌గా నిలిచింది.
2024, డిసెంబరు 29న న్యూయార్క్‌లో జరిగిన చివరి మూడు రౌండ్లలో వరుసగా రెండు డ్రాలు చేసుకుని, ఓ విజయం సాధించిన ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
తొమ్మిదో రౌండ్లో వెంజున్ (చైనా), పదో రౌండ్లో కేథరీనా (రష్యా)తో పాయింట్లు పంచుకున్న హంపి, 11వ రౌండ్లో ఐరీన్ కరిస్మా (ఇండోనేసియా)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.
8 పాయింట్లతో కేథరీనా (కాంస్యం)తో సమంగా నిలిచినప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో వెంజున్ రజతం అందుకుంది.
2019లోనూ ఆమె ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది.