Published on Oct 4, 2024
Government Jobs
కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులు
కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులు

బెంగళూరులోని కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్‌ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌ - 2, 3) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. కంపెనీ సెక్రటరీ (ఎంఎంజీఎస్-2): 03

2. కంపెనీ సెక్రటరీ (ఎంఎంజీఎస్-3): 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎల్ఎల్‌బీ డిగ్రీ, సీఏ/ ఐసీఏడబ్ల్యూ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ అభ్యర్థులకు రూ.100. 

జీతం: నెలకు కంపెనీ సెక్రటరీ (ఎంఎంజీఎస్-2) పోస్టులకు రూ.93,960; కంపెనీ సెక్రటరీ (ఎంఎంజీఎస్-3) పోస్టులకు రూ.1,05,280.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ ధ‌రఖాస్తుల‌కు చివరి తేదీ: 20-10-2024.

Website:https://canarabank.com/