Published on Sep 20, 2024
Apprenticeship
కెనరా బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
కెనరా బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

బెంగళూరులోని కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 3000 (ఎస్సీ- 479; ఎస్టీ- 184; ఓబీసీ- 740; ఈడబ్ల్యూఎస్‌- 295; యూఆర్‌- 1302)

వివరాలు:

ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 120, కర్ణాటకలో 600, తమిళనాడులో 350 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21-09-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 04-10-2024.

Website:https://canarabank.com/pages/Recruitment

Apply online:https://nats.education.gov.in/student_type.php