Published on Dec 31, 2025
Current Affairs
కన్యాకుమారిలో గాజు వంతెన ప్రారంభం
కన్యాకుమారిలో గాజు వంతెన ప్రారంభం

దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఏర్పాటుచేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ 2024, డిసెంబరు 30న ప్రారంభించారు.

కన్యాకుమారిలో బంగాళాఖాతం మధ్యన వివేకానంద స్మారక మండపం ఉంది. దీనికి సమీపంలో 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి.. తిరువళ్లువర్‌ విగ్రహాన్ని ప్రారంభించారు.

133 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటుచేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్‌జూబ్లీ వేడుకలు 2025 జనవరి 1న ప్రారంభం కానున్నాయి.

ఇందులో భాగంగా వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా సముద్రం మధ్యన 77 మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో రూ.37 కోట్ల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు.