Published on Nov 15, 2024
Government Jobs
కాన్పూర్ ఐఐటీలో ఆర్‌ఈఓ పోస్టులు
కాన్పూర్ ఐఐటీలో ఆర్‌ఈఓ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

పోస్టు పేరు - ఖాళీలు..

1. సీనియర్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్: 06

2. రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ (గ్రేడ్-1): 08

3. రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ (గ్రేడ్-2): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్/ మెటలర్జీ/ ఏరోనాటికల్), ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ (సివిల్/ ఎన్విరాన్‌మెంటల్/ కెమికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం: నెలకు ఆర్‌ఈఓ పోస్టులకు రూ.78,800-రూ.2,09,200; ఆర్‌ఈఓ (గ్రేడ్‌-1) పోస్టులకు రూ.67,700-రూ.2,08,700; ఆర్‌ఈఓ (గ్రేడ్‌-2) పోస్టులకు రూ.56,100-రూ.1,77,500.

వయోపరిమితి: ఆర్‌ఈఓ పోస్టులకు 48 ఏళ్లు; ఆర్‌ఈఓ (గ్రేడ్‌-1) పోస్టులకు 45 ఏళ్లు; ఆర్‌ఈఓ (గ్రేడ్‌-2) పోస్టులకు 40 ఏళ్లు మించి ఉండకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 08-12-2024.

Website:https://www.iitk.ac.in/