Published on May 2, 2025
Current Affairs
కన్నుమూసిన ప్రపంచ అత్యధిక వృద్ధురాలు
కన్నుమూసిన ప్రపంచ అత్యధిక వృద్ధురాలు

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన సిస్టర్‌ ఇనా కనబారో లుకాస్‌ 2025, మే 1న మరణించారు. ఆమె వయసు 116 సంవత్సరాలు. దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండ్‌ దు సుల్‌ రాష్ట్రంలో 1908, మే 27న జన్మించిన ఇనా తన 20వ ఏట కేథలిక్‌ నన్‌ (సన్యాసిని)గా మారారు. ఇనాకు 106వ ఏట కంటి శుక్లాలు తొలగించారు. అంతకు మించి ఆమెకు మరెలాంటి శస్త్ర చికిత్సలూ జరగలేదు.