భారత్ మూలాలు ఉన్న అనితా ఆనంద్, మణిందర్ సిద్ధూలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారు.
అనితకు విదేశాంగ శాఖ అప్పగించగా, సిద్ధూకి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వశాఖ కేటాయించారు. ఎన్నికల్లో లిబరల్ పార్టీ నెగ్గిన రెండు వారాల తర్వాత కార్నీ తన కొత్త మంత్రి మండలిని ప్రకటించారు.
ప్రమాణ స్వీకారం సమయంలో అనిత భగవద్గీతపై ప్రమాణం చేశారు.