Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 17, 2026
Current Affairs
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రముఖ కవి, రచయిత, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది. ఆయన రచించిన కవితా సంపుటి అనిమేషకు ఈ పురస్కారం లభించింది. అనిమేష అంటే రెప్పలు వాల్చనది అని అర్థం. కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న సంక్షోభాలు, ఆ సందర్భంగా మానవ సంబంధాల విచ్ఛిన్నం, కూలీల కష్టాలు తదితర అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని అనిమేషలో హృద్యంగా కవితలు చిత్రీకరించారు సిధారెడ్డి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి ఛైర్మన్‌గా సిధారెడ్డి సేవలందించారు.