ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయాధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫారసు చేసింది. వాటిలో ‘దీపిక’కు అవార్డు దక్కింది. 2025 మార్చి 8న ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు.
హిందీ రచయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కిరె సహా 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి. 2024, డిసెంబరు 18న సమావేశమైన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక మండలి వీరి పేర్లను ఖరారు చేసింది. ఒక్కొక్కరికి రూ.లక్ష బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారు.