కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్‌కుమార్ గోయల్ 2025, డిసెంబరు 13న నియమితులయ్యారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ ఈ పదవికి ఆయన పేరును సిఫార్సు చేసింది. అలాగే రైల్వే బోర్డు మాజీ ఛైర్మన్ జయవర్మ సిన్హా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మాజీ కార్యదర్శి సురేంద్రసింగ్ మీనా, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి కుశ్వంత్‌సింగ్ సేథి, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్‌దాస్, మాజీ ఐఏఎస్ అధికారి సంజీవ్‌కుమార్ జిందల్, సీనియర్ పాత్రికేయుడు పీఆర్ రమేష్, ఆశుతోష్ చతుర్వేదిలు కమిషనర్లుగా నియమితులయ్యారు.