కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తాజా నివేదిక
సంపూర్ణ పోషక భాండాగారాలుగా గుర్తింపు పొందిన చిరుధాన్యాల సాగు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.
2023-24లో 175.72 లక్షల టన్నుల ఉత్పత్తి జరగగా... 2024-25లో 180.16 లక్షల టన్నులకు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తాజా నివేదిక వెల్లడించింది.
సాగు సైతం 79 లక్షల ఎకరాల నుంచి 90 లక్షల ఎకరాలకు చేరింది.
దేశంలో గత అయిదు దశాబ్దాల్లో ఇదే అత్యంత ఎక్కువ పెరుగుదల.
ప్రజల నుంచి ఆదరణతోపాటు ధరలు ఆశాజనకంగా ఉండడం, సాగు వ్యయం తక్కువ కావడంతో రైతులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు.